హైదరాబాద్:అక్టోబర్ 06
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది, వంగ గోపాల్ రెడ్డి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే, ఈ నేపథ్యంలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది బదులిస్తూ, హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిం దని తెలిపారు.
అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తా రా?” అని వ్యాఖ్యానించిన ధర్మాసనం, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలే మని చెబుతూ పిటిషన్‌ను తిరస్కరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేసిందని వంగా గోపాల్ రెడ్డి తన పిటిషన్లో ఆరోపించారు.
ఎస్సీలకు 15 శాతం, ఎస్టీల కు 10 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోటా 67 శాతానికి చేరిందని, ఇది చట్టవిరుద్ధ మని పేర్కొన్నారు. జీఓ నంబర్ 9ను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్లో మాధవరెడ్డి, తీన్మార్ మల్లన్న కూడా ఇంప్లీడ్ అయ్యారు.
కాగా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీఓ నంబర్ 9ను జారీ చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ జీఓ ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఐదు దశల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








