V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం….

SHARE:

 

 

– కెసిఆర్ 10 సంవత్సరాల పరిపాలన దక్షతను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచనలు

 

– బిఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలి

 

– స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటి అన్ని స్థానాలలో గెలుపొందే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం

 

– బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గొడిసెల నర్సింలు గౌడ్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల మండల స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్,రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావ్,బాన్సువాడ మాజీ జెడ్పిటిసి నార్ల రత్న కుమార్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసిలు,సర్పంచులు గా పోటీ చేసి గెలుపొంది స్థానిక సంస్థలపై బిఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పలు విషయాలు చర్చించారు. బిఆర్ఎస్ పార్టీ వైభవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. కెసిఆర్ పది సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 13 వాగ్దానాలు,420 గ్యారెంటీల హామీలు ఇచ్చి మాయమాటలతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసపూరిత హామీలతో నయవంచన చేసిన విషయం వివరించాలని కార్యకర్తలకు పలు సూచనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను 20 మందిని బిఆర్ఎస్ పార్టీ కండువా కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు టేకుర్ల సాయిలు,వెంకట్ సార్, గంపల శంకర్, అల్లం రాములు, లక్ష్మణ్, గంగాధర్, డి.సాయిలు, శ్రీనివాస్ గౌడ్, రాజు, రేహాన్, రాము, శ్రీను, భూమయ్య, సాయిలు, లక్ష్మణ్, దత్తు, బద్రి, దేవి, మోచి గణేష్ ,ఎజాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india