V1News Telangana

best news portal development company in india

బడా పహాడ్ లో పైసా వసూల్… నిరాశ చెందుతున్న భక్తులు…

SHARE:

బడా పహాడ్ లో పైసా వసూల్…

నిరాశ చెందుతున్న భక్తులు…

డబ్బుల డిమాండ్ కు భయపడి తగ్గిన భక్తుల రద్దీ…

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన దర్గా హజ్రత్ సయ్యద్ షాదుల్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దర్గాలో మొక్కులు తీర్చుకోవడానికి ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తులో తరలి వచ్చేవారు. ఈమధ్య గత కొన్ని సంవత్సరాలు నుంచి లక్షల్లో కోట్లలో టెండర్ అవడంతో టెండర్ కి పెట్టిన పైసలు వసూల్ చేయడానికి కాంట్రాక్టర్లు భక్తుల వద్ద నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తువస్తున్నారు. మోక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వారు ఇక్కడ జేబులు కాలిచేసి వేవాల్సిందే ఒక మేక కోస్తే దానికి 500 నుంచి ₹1000 ఇవ్వాల్సిందేనట, అదేవిధంగా దర్గా కింద ఉన్న రూమ్లలో ఉండాలన్న వాటి ఖర్చు కూడా ఎక్కువగా ఉందని, కొబ్బరికాయ అగరవత్తి తీసుకుంటే వంద రూపాయలట, అలాగే దేవుడిని దర్శించుకోవాలంటే ముందుగా హుండీలో డబ్బులు వేయాల్సిందే అంటూ కొందరు దర్గా ముజావర్లు డిమాండ్ చేస్తారట,పట్టపగలే ఈ విధంగా భక్తులను దోచుకోవడం అన్యాయమని వార్త పత్రికల్లో టీవీ ఛానల్ లో ఎన్నోసార్లు ప్రచురితం చేసిన మాకేంటి అనే విధంగా వాక్ బోర్డ్ కు సంబంధించిన అధికారులు వ్యవహరిస్తున్నారని దర్గాకు వచ్చిన భక్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బడా పహాడ్ లో జరుగుతున్న దోపిడిని ఆపి తమకు న్యాయం చేయాలని షాదుల్లా బాబా మీద ఉన్న ప్రేమతో మొక్కులు తీసుకోవడానికి వచ్చే భక్తులు అధికారులతో కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india