నిజామాబాద్ జిల్లా:
పేకాట ముఠాలు సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ చురుగ్గా కదలాడుతున్నాయి. ముఖ్యంగా పోతంగల్ చెక్పోస్ట్, కోటగిరి– సరిహద్దు, తెలంగాణ–మహారాష్ట్ర బార్డర్ ప్రాంతాల్లో పేకాట దందా మళ్లీ జోరందుకుంది.
సమాచారం ప్రకారం, ముగ్గురు వ్యక్తులు ఈ పేకాట దందాకు నాయకత్వం వహిస్తున్నారు. వారు వివిధ రాష్ట్రాల నుంచి పేకాట రాయుళ్లను రప్పించి ప్రతిరోజూ భారీ మొత్తాలతో పేకాట ఆడిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
అటు మహారాష్ట్ర పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు కంటతడిలోంచి తప్పించుకుంటూ ఈ ముఠా రహస్యంగా పేకాట స్థావరాలు మార్చుకుంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.

స్థానికుల ఆక్షేపణ ప్రకారం, ఈ దందాపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు గణనీయమైన చర్యలు జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ ముగ్గురు పేకాట నిర్వాహకుల పేర్లు, వారి నివాస ప్రాంతాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








