V1News Telangana

best news portal development company in india

🚨 నిజామాబాద్ CCS టీం మెరుపు దాడి – పేకాట రాయుళ్ల అరెస్ట్! 🔹 💰 25,230/- నగదు – 15 సెల్‌ఫోన్లు స్వాధీనం! 🔹 👮‍♂️ 16 మంది అదుపులో – PS కు అప్పగింత 🔹 వర్ణి పేకాట స్థావరాలపై పోలీసుల ఆపరేషన్

SHARE:

నిజామాబాద్ CCS టీం పేకాట స్థావరాలపై మెరుపుదాడి – 16 మందిని అదుపులోకి తీసుకున్నారు

నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ రోజు (25-09-2025) గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో, CCS SI గోవింద్, SI మహేష్ మరియు సిబ్బందితో కలిసి రెండు చోట్ల పేకాట స్థావరాలపై మెరుపుదాడులు జరిపారు.

ఈ దాడుల్లో మొత్తం ₹25,230/- నగదు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు, 16 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వర్ని SHOకు అప్పగించారు.

🔸 వర్ని పోలీస్ స్టేషన్ పరిధి – మోస్రా గ్రామం
– 7 మంది పేకాట రాయుళ్లు
– 7 సెల్ ఫోన్లు, నగదు ₹13,300/- స్వాధీనం

🔸 వర్ని పోలీస్ స్టేషన్ పరిధి – మోస్రా గ్రామం (మరొక స్థావరం)
– 9 మంది పేకాట రాయుళ్లు
– 8 సెల్ ఫోన్లు, నగదు ₹11,930/- స్వాధీనం

ఈ సందర్భంగా పోలీసులు పేకాట రాయుళ్లపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india