– వేద పండితుల సమక్షంలో హోమం కార్యక్రమం నిర్వహణ
– అమ్మవారి నామ స్మరణలతో మారుమోగిన మండపం పరిసరాలు, మైమరిచిపోయిన భక్తులు
– ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకుని అన్న ప్రసాద వితరణ స్వీకరించిన భక్తులు
– యువజన దుర్గ భవాని మండలి
నసురుల్లాబాద్ ప్రతినిధి : V1 న్యూస్ , సెప్టెంబర్ (25 )కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శ్రీ యువజన దుర్గా భవాని మండలి ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవి అవతారం సందర్భంగా బుధవారం రోజు అమ్మవారి సన్నిధిలో వేద పండితుల సమక్షంలో హోమం, ప్రత్యేక పూజలు కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలతో మాలలు సిద్ధం చేసి అమ్మవారిని అందంగా అలంకరించారు.ఈ సందర్భంగా భక్తులు, వివిధ గ్రామాల ప్రజలు దైవిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా మాలాధారణ ధరించి పురుషులు మరియు మహిళలు నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో, అమ్మవారి నామ స్మరణలతో, వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని చల్లగా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం భక్తులు అన్న ప్రసాద వితరణ స్వీకరించారు. ఈ సందర్భంగా యువజన దుర్గ భవాని మండలి సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలతో పాడిపంటలు సమృద్ధిగా పండి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








