V1News Telangana

best news portal development company in india

బస్వాయిపల్లి పేలాల బట్టి పరిశ్రమలో ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం ప్రత్యక్షం….

SHARE:

 

– రైస్ మిల్లుల నుండి పక్క దారి పడుతున్న సీఎంఆర్ ధాన్యం

– ఈ ధాన్యం ఎక్కడిది..

 

– సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం

 

– పరిశ్రమపై చర్యలు తీసుకొని ధాన్యాన్ని సీజ్ చేయాలని రైతుల డిమాండ్

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజవర్గం వివిధ మండలాల్లో రైస్ మిల్లుల నుండి సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే నసురుల్లాబాద్ మండలం బస్వాయి పల్లి గ్రామ శివారులో గల పేలాలు (మరమరాలు) పరిశ్రమ బట్టిలో ప్రభుత్వ (FCI )ధాన్యం ప్రత్యక్షమవడం దానికి నిదర్శనం వివిధ రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన సిఎంఆర్ ధాన్యాన్ని పేలాల పరిశ్రమ యజమాని తమ గోదాంలో దాదాపు 1000 బస్తాలు నిల్వచేసిన వైనం. ఈ ధాన్యంతో మరమరాలు తయారు చేస్తున్న పరిశ్రమ ఈ పరిశ్రమ లో నిల్వ చేసిన ధాన్యం ఎక్కడిదని రైతులు ప్రశ్నిస్తున్నారు. సిఎంఆర్ ధ్యానం పక్కదారి పట్టినట్లు ప్రభుత్వం గుర్తించి ఖరీఫ్ రబీ సీజన్ లో రైసుమిల్లర్లకు ధాన్యం కేటాయించలేదు అయినా రైస్ మిల్లుల తీరులో మార్పు రాలేదు ప్రభుత్వ ఖజానకు భారీగా గండి కొట్టి కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కొన్ని రైస్ మిల్లుల యాజమాన్యాలు సివిల్ సప్లై అధికారులు వారికి ఇచ్చిన టార్గెట్ లను రీచ్ కాలేవు కానీ వివిధ రకాలుగా బయట మార్కెట్లో అక్రమం గా అమ్మకం చేసినట్లు ఈ ధాన్యం ప్రత్యక్షమవడం చూస్తే విషయం ఇట్టే మనకుఅర్థం అవుతుంది. పేలాల బట్టిలో సీఎంఆర్ ధాన్యం ప్రత్యక్షమవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది.. ఈ ధాన్యం ఎక్కడి నుండి వచ్చింది అనే సందేహాలకు సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ జరిపితే విషయాలు బహిర్గతం అవుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india