Post Views: 86
ఇంటి గొడవపై భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఉన్మాది ఆగ్రహం
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కత్తితో హెడ్ కానిస్టేబుల్, హోం గార్డుపై దాడి
పారిపోయిన ఉన్మాదిని అర్ధరాత్రి పంటచేలో పట్టుకున్న పోలీసులు

బైంసా : కుబీర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులపై కత్తితో దాడి చేసిన ఉన్మాది పట్టుబడ్డాడు. గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో దాడి జరిపి పారిపోయిన నిందితున్ని పోలీసులు అర్ధరాత్రి వేళ పట్టుకొని అరెస్టు చేశారు. శుక్రవారం బైంసాలో ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి ఘటన వివరాలు వెల్లడించారు.
ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం — మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన అబ్దుల్ కలీమ్ (51) అనే వ్యక్తి కుబీర్ మండల కేంద్రంలోని తన అత్తగారి ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చాడు. గురువారం కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో, మత్తులో ఉన్న అబ్దుల్ కలీమ్ “నేనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వాళ్ల సంగతి చూస్తాను” అంటూ బయలుదేరాడు.
కుబీర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అబ్దుల్ కలీమ్ సైకో తీరుతో ప్రవర్తించడంతో, డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ అతన్ని ఎందుకు వచ్చావని అడిగాడు. లోపలికి రావడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఉన్మాది తన వెంట తెచ్చుకున్న కత్తితో హెడ్ కానిస్టేబుల్ నారాయణపై దాడి చేశాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన హోం గార్డు గిరిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
గాయపడిన పోలీసు సిబ్బందిని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని పట్టుకునేందుకు బైంసా రూరల్ సీఐ నైలు, ఎస్ఐ కృష్ణారెడ్డిలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి, పంటచేలో దాక్కున్న అబ్దుల్ కలీమ్‌ను పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
విధినిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో భైంసా టౌన్ సీఐ గోపినాథ్, రూరల్ సీఐ నైలు, ముధోల్ సీఐ మల్లేష్, కుబీర్ ఎస్ఐ కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








