V1News Telangana

best news portal development company in india

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా “పోషకాహార వారోత్సవాలు”నిర్వహణ….

SHARE:

 

 

– ముఖ్య అతిథులుగా హాజరైన ఐసిడిఎస్ CDPO సౌభాగ్య, మెడికల్ ఆఫీసర్ నాగ గిరీష్

 

– కిషోరి బాలికలకు రక్త పరీక్షలు నిర్వహణ, పాలు పండ్లు ఆకుకూరలు కోడిగుడ్లు, చిరుధాన్యాలలో అధిక పోషక విలువలు ఉంటాయని సూచనలు

 

– పరిశుభ్రత పాటిస్తూ పోషకాహారాన్ని భుజించాలని అవగాహన అనంతరం అందరమూ పాటిస్తామని ప్రతిజ్ఞ

 

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల అంగన్వాడి కేంద్రం -1 లో గురువారం రోజు అంగన్వాడి టీచర్ లు గౌరమ్మ మరియు గంగామణి ల ఆధ్వర్యంలో “పోషకాహార వారోత్సవాలు”ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ CDPO సౌభాగ్య, మెడికల్ ఆఫీసర్ నాగ గిరీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కిశోరి బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించి.. పోషకాహారం గురించి సరైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా CDPO సౌభాగ్య మాట్లాడుతూ పోషకాహార లోపం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని అన్నారు. పోషకాహార లోపం వలన పిల్లలలో సరైన ఎదుగుదల లేకపోవడం వలన, నీరసంగా శక్తి ఉండకపోవడంతో తరచూ అనారోగ్యాల పాలవుతారని అన్నారు.అందువల్ల అందరూ పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ మెరుగైన ఆహార పద్ధతులను అలవాటు చేసుకోవాలని అదేవిధంగా పరిశుభ్రతను కూడా పాటించాలని తెలిపారు. పాలు, పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు మరియు చిరుధాన్యాలు వంటి పోషక విలువలు అధికంగా లభించే ఆహార పదార్థాలను భుజించాలని తగు సలహాలు తెలియజేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు స్వీకరిస్తూ సరైన వ్యాయామాలు చేయడం వలన పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా, బలంగా జన్మిస్తారని పేర్కొన్నారు.. తద్వారా పసిపిల్లలలో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చని పలు సూచనలు చేశారు.అనంతరం అందరూ కలిసి “పోషకాహార పద్ధతులు”పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో MLHP జావీద్, మెడికల్ సూపర్వైజర్ సుశీల, ANM వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్త కవిత, కిషోరి బాలికలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india