Post Views: 53
✍️ గ్రామ పెద్దలు అబ్బగోని లక్ష్మీ నర్సయ్య గౌడ్.
✍️ రూ 11 వేల 111 విరాళం.
బోధన్ : రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నిర్వహించనున్న దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ప్రతిష్టాపన నిర్వహించడానికి గ్రామ దుర్గామాత యూత్ సన్నాహకాలు చేశారు.గురువారం దుర్గాదేవి శరన్నవరాత్రులు నిర్వహించడానికి మండప ఏర్పాటు కొరకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అబ్బగోని లక్ష్మీ నర్సయ్య గౌడ్ రూ 11వేల 111 రూపాయలను విరాళంగా మండప నిర్వహణ కమిటీ ప్రతినిధులకు అందజేశారు.దుర్గాదేవి శరన్నవరాత్రులు సాటాపూర్ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నిర్వహించనున్న సందర్భంగా విరాళాన్ని అందజేసిన అబ్బ గోని లక్ష్మీ నర్సయ్య గౌడ్ కుటుంబాన్ని దేవి మాత కృపాకటాక్షాలతో సుఖ సంతోషాలతో ఉంటూ అష్టైశ్వర్యాలు పొందాలని దేవి మాతను కమిటీ ప్రతినిధులు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సాటాపూర్ దుర్గాదేవి యూత్ మరియు దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రతినిధులు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









