Post Views: 108
— సాలురా గ్రామంలో పరిశుభ్రతపై ఉపాధ్యాయుల అవగాహన ర్యాలీ.
— పాఠశాలల పరిశుభ్రతపై గ్రామస్తులు అధికారులు ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలి.
— సాలూర మండల విద్యాశాఖ అధికారిని రాజీ మంజూష.
బోధన్ : ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతపై గ్రామస్తులందరూ బాధ్యతగా ఉండాలని సాలూర మండలం విద్యాశాఖ అధికారిని రాజీ మంజుష పిలుపునిచ్చారు.బుధవారం పరిశుభ్రమైన పాఠశాల ఆరోగ్యకరమైన గ్రామం అనే నినాదంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు శుభ్రత పై అవగాహన కల్పించారు.పరిసర ప్రాంతంలోని నివాసం ఉంటున్న ప్రజల ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత పాటించడం వలన ఎంతటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయో ప్రచురణ చేసిన కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు.గ్రామంలో వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.శుభ్రమైన పాఠశాల ఆరోగ్యకరమైన గ్రామాన్ని సాధించుకుందాం,చేయి చేయి కలుపుదాం పరిశుభ్రం వైపు అడుగులు వేద్దాం అంటూ నినాదాలు చేశారు.సెలవు దినాలలో ఆకతాయిలు పాఠశాల పరిసరాలలో మద్యం సేవించి బాటిళ్లను పగులగొట్టడంతో పాటు గుట్కాలు,పాన్ మసాలా ఉమ్మి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ యువకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి తోడ్పాటును అందించవలసిన అవసరం ఉందని సాలూర మండల విద్యాశాఖ అధికారి రాజీమంజుష అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









