V1News Telangana

best news portal development company in india

సాలుర మండలంలో ఘనంగా రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

SHARE:

 జాతీయ పతాక ఆవిష్కరణ – తెలంగాణ తల్లి, గాంధీ చిత్రపటాలకు నివాళులు
 ఎంపీడీవో, తహసీల్దార్, ప్రజా ప్రతినిధుల శుభాకాంక్షలు..
సాలూర:సాలూర మండలంలో రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల ప్రజాపరిషత్, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్), గ్రామ పంచాయతీ కార్యాలయాలలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిపాలన అధికారి ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ తల్లి, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.
మండల ప్రజలకు ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, ఎంఈఓ రాజీ మంజూష, ఏవో శ్వేత రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాలూర పిఎసిఎస్ చైర్మన్ అల్లె జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లె రమేష్, ఇల్తెపు రమేష్, మైదాపు నాగరాజు, బుద్దె లక్ష్మణ్, డిస్కో సాయిలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, సీఈఓ బసవంత్ రావు, కార్యాలయాల సిబ్బంది, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india