భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి : కలెక్టర్
తహసీల్దార్ కార్యాలయంపై కలెక్టర్ తనిఖీ
సాదా బైనామా, పీఓటీ దరఖాస్తులపై క్షుణ్ణ పరిశీలన ఆదేశం
భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించండి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
సాలూర తహసీల్దార్ కార్యాలయం తనిఖీ – బోధన్ సబ్ కలెక్టర్‌తో సమీక్ష

నిజామాబాద్, సెప్టెంబర్ 16:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
మంగళవారం ఆయన సాలూర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి మండలంలో భూభారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ తహసీల్దార్ వై.వి. శశిభూషణ్ ను అడిగి, దరఖాస్తుల పరిష్కార స్థితి, పెండింగ్ అర్జీలు, ఇచ్చిన నోటీసులు, క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులను పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.
సాదా బైనామా, పీఓటీ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే నోటీసులు ఇవ్వాలని, క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి అర్హులకు ఆమోదం తెలపాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కోసం ముందుగానే జాబితాలను సిద్ధం చేసుకోవాలని, ఆ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధమవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








