V1News Telangana

best news portal development company in india

“సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్ల వేడుక”

SHARE:

“సర్ ఎం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్ల కృషికి అభినందనలు”

సౌదీ అరేబియాలో ఇంజనీరింగ్ దినోత్సవ వేడుకలు..

సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో రియాద్‌లో ఇంజనీరింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఇంజనీర్లు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
SATA TBN అధ్యక్షులు యోగేశ్వరరావు వీరవల్లి మాట్లాడుతూ, “సౌదీ అరేబియాలోని మన తెలుగు ఇంజనీర్లు కలసి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకం” అన్నారు.
SATA రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటాం. ఆయన నీటిపారుదల, జలవనరుల నిర్వహణ, ఆనకట్టలు, వంతెనల నిర్మాణం వంటి రంగాలలో చేసిన కృషి అమోఘం” అన్నారు.
SATA వ్యవస్థాపకులు మల్లేశన్ తెలుగు ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో SATA రియాద్ కోర్ టీమ్ సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, మహమ్మద్ నూరుద్దీన్, సింగూ నరేష్‌కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్, రోజ్దార్ సయ్యద్ (అస్లాం), పెంటపాటి శ్రీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india