– కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటుతో పాటు ఠాణాల అప్‌గ్రేడేషన్ ప్రక్రియకు నిరీక్షణ
– ప్రమోషన్లు లేక నిరాశకు గురవుతున్న ఖాకీలు
– ఎస్హెచ్వోలుగా ఎస్సైల స్థానంలో అనధికారికంగా సీఐలు
హైదరాబాద్ న్యూస్ ఈస్ట్ జోన్ ప్రతినిధి – చంద్రశేఖర్ ; తెలంగాణలో కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతమున్న ఠాణాల అప్‌గ్రేడేషన్ (ఉన్నతీకరణ) ప్రక్రియకు నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు ప్రమోషన్స్ దక్కక పలువురు నిరాశకు గురవుతున్నారు. మల్టీ జోన్-1లో 2012 బ్యాచ్ ఎస్సైలు సుధీర్ఘంగా అంటే 13 ఏళ్లుగా ఇన్స్పెక్టర్ పదోన్నతి కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదే బ్యాచ్‌లో కొందరికి ప్రమోషన్స్ లభించగా, సరిపడా పోస్ట్‌లు లేని కారణంగా మరికొందరు ఎస్సైలుగానే మిగిలిపోయారు. పోలీస్స్టేషన్ల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ కార్యరూపం దాల్చకపోవడంతో అవసరాల రీత్యా కొన్ని ఠాణాల్లో ఎస్సైల స్థానంలో ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్)లుగా సీఐలనే నియమిస్తున్నారు.
సాధారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసినప్పుడు ఎఫ్ కేటగిరీలో ఉంచుతారు. ఆ ఠాణాలో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు మొత్తం 28 మంది సిబ్బంది ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిని బట్టి ఈ కేటగిరీని అప్‌గ్రేడ్ చేస్తారు. ఇ కేటగిరీలో 45 మంది డి లో 55 ఇలా పోలీసులు పెరుగుతూ ఉంటారు. అప్‌గ్రేడేషన్ కోసం పంపిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు.
ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవులను ప్రకటించినా సిబ్బంది కొరతతో అదీ అమలు కావడం లేదు. సాధారణ సెలవు ఎప్పుడు దొరుకుతుందా? అని కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని సిబ్బంది వాపోతున్నారు. కొత్త ఠాణాలతో పాటు ప్రస్తుత పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌తో కొత్తగా 56 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు 179 మంది సబ్ ఇన్స్పెక్టర్లు 317 మంది ఏఎస్సైలు 708 మంది హెడ్‌కానిస్టేబుళ్లు 4,543 మంది సాధారాణ కానిస్టేబుళ్లు మొత్తం 5,803 పోస్టుల కోసం అధికారులు ప్రతిపాదనలు చేశారు. కానీ దురదృష్టం కొద్ది ఇవన్నీ కార్యరూపం దాల్చలేదు.
వరంగల్ కమిషనరేట్‌లో జనగామ, కేయూసీ, నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, ములుగు, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఏర్పాటు అయ్యాయి.
కొత్తగా సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్నవారికి అదనపు పని భారం పడుతోంది. పోలీస్‌స్టేషన్ పరిధిలో ధర్నాలు, వీఐపీల రాక, రాస్తారోకోలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు సాధారణంగా ఉంటాయి. ఠాణాల్లో ఉన్న కొద్దిపాటి సిబ్బందికి కోర్టుల విధులు, రైటర్లు, గన్మెన్లు, బ్లూకోల్ట్, ఫిర్యాదుల స్వీకరణ, మిగిలిన సిబ్బంది తదితర విధులను అప్పగిస్తున్నారు. ఈ సమస్యలపై పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించగా అవసరం ఉన్న ప్రాంతాల్లో నూతన పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెబుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








