నిజామాబాద్, సెప్టెంబర్ 14:
విదేశాలలో అధిక వేతనాలతో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ యువతను మోసం చేసి సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న వ్యక్తిపై నిజామాబాద్ పోలీసులు పి.డి యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) నమోదు చేసి అరెస్ట్ చేశారు.
నిందితుడు కోలనాటి నాగశివ (36) తండ్రి సత్యనారాయణరాజు కోలనాటి, వాసం – వెంకటేశ్వర కాలనీ, సుచిత్ర, జీడిమెట్ల, తెలంగాణ. ఇతను యువతకు “కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు” కల్పిస్తామని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి, వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని చట్టవిరుద్ధమైన సైబర్ మోసాలకు బలవంతం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇతనిపై పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ క్రింది కేసులు నమోదు అయ్యాయి:
1. Cr. No.10/2025 – CCPS, నిజామాబాద్
2. Cr. No.11/2025 – CCPS, నిజామాబాద్
3. Cr. No.107/2025 – ఆర్మూర్ పోలీస్ స్టేషన్
4. Cr. No.119/2025 – చందుర్తి పోలీస్ స్టేషన్ (సిరిసిల్ల జిల్లా)
ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిపై తేది 13-9-2025న పి.డి యాక్ట్ ప్రయోగించి చెంచల్‌గూడ జైలుకు తరలించారు.
సైబర్ నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. గారు హెచ్చరించారు. విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసగించేవారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








