– కార్యకర్తను ఆదుకోవాలనే సంకల్పంతో చేయి చేయి కలిపి డబ్బులు పోగు చేసిన వైనం
– పలు సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న యువ నాయకులు
– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన బిజెపి బూత్ అధ్యక్షుడు బండపల్లి శ్రీను తండ్రి శనివారం రోజు అర్ధరాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు ఆదివారం రోజు కార్యకర్తలతో కలిసి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం తమ వంతుగా 4600 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహకారం అందజేసినందుకుగాను బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించి, ఆర్థికంగా డబ్బులు పోగేసుకున్న నాయకులు సైతం కార్యకర్తల యోగక్షేమాలను పట్టించుకోని ఈ రోజుల్లో బిజెపి మండల అధ్యక్షుడిగా రెండు దఫాలు పనిచేసి భారతీయ జనతా పార్టీని మండల వ్యాప్తంగా బలోపేతం చేసి ప్రస్తుతం జిల్లా కౌన్సిల్ మెంబర్ గా కొనసాగుతున్న సున్నం సాయిలు కార్యకర్తలకు, పేద ప్రజలకు తనవంతుగా తోచిన సహాయ సహకారాలు అందిస్తూ అందరితో మమేకమై పనిచేస్తున్నారని పలువురు వారిని అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయనతోపాటు బిజెపి మండల సీనియర్ నాయకులు అనుసూరి శ్రీనివాస్, అరిగె నారాయణ, పెర్క రాములు, గొడిసెల యాదగిరి గౌడ్, మనూర్ సాయిలు, ర్యాపని మహేష్, కొప్పుల సాయిలు, జల్ల సాయి, కార్యకర్తలు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








