Post Views: 312
గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో రియాద్‌లో విశిష్టంగా నిర్వహణ…
:
సౌదీ అరేబియాలో గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అపూర్వంగా నిర్వహించబడ్డాయి. రియాద్ జనసేన అధ్యక్షుడు మురారి తాటికాయల నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన ప్రముఖ నాయకులు శ్రీమతి ఉష, గురుకిరణ్, శ్రీనివాస్ రావూరి, సీతారామ్, యాకుబ్ ఖాన్, ఆనందరాజు, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జనసైనికులు, వీరమహిళలు, మెగా అభిమానులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా నుండి జనసేన సౌదీ అరేబియా రీజినల్ కన్వీనర్ అమీర్ ఖాన్ శుభాకాంక్షలు పంపుతూ, కొత్త కార్యవర్గం సహకారంతో NRI జనసేన మరింత బలపడుతుందని అభిలాషించారు.
SATA, TASA ప్రతినిధుల ప్రత్యేక హాజరు…
ప్రత్యేక ఆహ్వానంపై SATA రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ పిలుపుమేరకు SATA కోర్ టీమ్ సభ్యులు మహమ్మద్ నూరుద్దీన్, మిధున సురేష్, అస్లాం, లోకేష్ తాళ్ల, కోకిల ఒతులూరి, ముదిగొండ శంకర్, సింగు నరేష్, యోగేష్, షాహాబాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా SATA సభ్యురాలు కోకిల ఒతులూరి తన గానంతో అందరినీ ఆకట్టుకున్నారు.
అలాగే TASA Founder స్వామి స్వర్ణ, రియాద్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర వాకాటి, అనిల్ మర్రి, ఇబ్రహీం షేక్, నటరాజ్, అజయ్ రావూరి, సాయి తదితర TASA సభ్యులు పాల్గొన్నారు. ఈ రెండు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఐక్యతకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒకరికి ఒకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
యువత ముందుకు రావాలని మురారి తాటికాయల పిలుపు..
కార్యక్రమం చివరగా రియాద్ జనసేన అధ్యక్షుడు మురారి తాటికాయల మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కులమత ప్రస్తావనలేని రాజకీయాల కోసం యువత ముందుకు రావాలని కోరారు. NRI తెలుగు ప్రజలకు అండగా నిలవడంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....












