Post Views: 249
👉 అక్కడికక్కడే జిపి సిబ్బంది ఇద్దరు మృత్యువాత.
👉 ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు
👉 కల్దుర్కి సిద్దాపూర్ మార్గమధ్యంలో దుర్ఘటన.
బోధన్ : బోధన్ మండలం కల్దుర్కీ సిద్దాపూర్ మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు బిక్నేల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ గురువారం బోల్తా కొట్టింది.ఈ దుర్ఘటనలో గ్రామపంచాయతీ సిబ్బంది ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.ట్రాక్టర్ పై విద్యుత్ స్తంభాలను తీసుకెళ్లే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఘటన స్థలానికి పోలీసులు వచ్చి విచారణ చేపడుతున్నారు.విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








