– స్టేట్ లెవెల్ రెజ్లింగ్ పోటీలలో ప్రథమ బహుమతి కైవసం చేసుకుని మెరిసిన పొతంగల్ మండలానికి చెందిన బాలిక
– మల్ల యోదురాలికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేసిన కోనేరు శశాంక్, భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా
– భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటే విధంగా (ఒలంపిక్స్) లో పాల్గొనేలా రెజ్లింగ్ లో మరింత కృషి చేయాలని బాలికకు పలు సూచనలు
– బిజెపి పొతంగల్ మండల సీనియర్ నాయకులు మార్కెళి ప్రకాష్ పటేల్
పొతంగల్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం, పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన అజ్మీరా లక్ష్మీ తండ్రి పేరు కీ.శే విఠల్ కుమార్తె రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కుస్తీ పోటీలలో ప్రథమ బహుమతి సాధించి తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, గ్రామానికి గొప్ప పేరు తీసుకొచ్చింది. కృషి పట్టుదలతో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించినందుకుగాను మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆమె ప్రతిభను కొనియాడుతూ ప్రశంసలతో అభినందిస్తున్నారు. జాతీయస్థాయిలో రాణించడానికి ప్రతిభ, తపన ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ముందుకు వెళ్లలేక పోతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ సహృదయంతో వెంటనే స్పందించి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గురువారం రోజు ఆమెకు 5000 రూపాయలు తక్షణ సహాయం బిజెపి సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో జన్మించి తండ్రి లేనప్పటికీ కష్టపడి, కసితో అజ్మీరా లక్ష్మీ కుస్తీ పోటీలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం పట్ల గర్వంగా ఉందని కొనియాడారు. ఇదేవిధంగా కృషి పట్టుదలతో జాతీయస్థాయిలో కూడా రాణించి అంతర్జాతీయ వేదికలలో కూడా ప్రతిభ కనబరచాలని కోరారు. ఒలంపిక్స్ వంటి ప్రపంచ స్థాయి మెగా టోర్నీలో పాల్గొనే విధంగా కృషి చేయాలని పలు సూచనలు చేశారు.అంతేకాకుండా భవిష్యత్తులో ఆమె క్రీడలలో రాణించడానికి తగిన విధంగా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని భరోసా కల్పించారు. గొప్ప మనసుతో ఆర్థిక సహాయం అందజేసినందుకుగాను బాలిక, కుటుంబ సభ్యులు కోనేరు శశాంక్ మరియు ప్రకాష్ పటేల్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పలు రకాల సేవా కార్యక్రమాలతో పేద ప్రజలను ఆదుకుంటున్నందుకుగాను పోతంగల్ మండల ప్రజలు కోనేరు శశాంక్ ను కీర్తించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఓమన్న పటేల్, యం.సంతోష్ పటేల్,డి.రాజు, గంగాధర్ పటేల్, బూత్ అధ్యక్షులు వినోద్,రమేష్, విజయ్, జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన పెద్దలు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








