V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్ AMCలో అనుమానాస్పద కదలికలు – భద్రతపై ప్రశ్నార్థక చిహ్నం

SHARE:

పగలు, రాత్రి తేడా లేకుండా మార్కెట్ కమిటీలో బస – వ్యాపారులు, రైతుల ఆందోళన…
. AMC యార్డ్‌లో గుర్తు తెలియని వ్యక్తుల గుడారాలు – స్థానికుల ఆరోపణలు తీవ్రం..
. దొంగతనాలు, అక్రమ కార్యకలాపాల భయాలు – మార్కెట్ కమిటీపై భద్రత లోపం బహిర్గతం…
. రాజకీయ ఆశ్రయంతో జరుగుతున్నారా అనధికారిక నివాసాలు? – ప్రజల గుసగుసలు..
 మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం… రెండు సార్లు ఫిర్యాదు చేసినా చర్యలేదంటూ ఆరోపణలు….
. విశిష్ట గుర్తింపు గల నిజామాబాద్ AMCలో భద్రతా లోపాలు బయటపడుతున్నాయి..
నిజామాబాద్ ప్రతినిధి:నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రాత్రి, పగలు అని తేడా లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల సంచారం పెరగడం వ్యాపారులు, రైతులు, స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా రాత్రివేళల్లో జనసంచారం తగ్గే మార్కెట్ యార్డ్‌లో ఇటీవల తాత్కాలిక షెడ్లు, గుడారాలు వేసుకుని అనుమానాస్పద వ్యక్తులు నివాసం ఉంటున్నారని స్థానికులు తెలిపారు.
దీంతో దొంగతనాలు, అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్నాయంటూ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో చాలా మందికి గుర్తింపు కార్డులు లేకపోవడం, స్థానిక చిరునామాలు లేకపోవడం, అంతేకాకుండా ఒక ప్రజా ప్రతినిధి అండతోనే ఈ కార్యకలాపాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతులు, కార్మికుల మాదిరిగా కనిపించని ఈ అనుమానాస్పద వ్యక్తులు నెలల తరబడి మార్కెట్ కమిటీ ప్రాంగణంలోనే నివాసం ఉంటుండటంపై మార్కెట్ చుట్టుపక్కల ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నారు. రెండు పర్యాయములు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
నిజామాబాద్ AMC రాష్ట్రంలో ఒక విశిష్ట గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ, ఇలాంటి భద్రతా లోపాలు కొనసాగితే అభివృద్ధి దిశలో వెనకడుగు పడే ప్రమాదం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని, అనధికారికంగా నివసిస్తున్న వారిని తరలించాలని వ్యాపారులు, రైతులు, స్థానికులు కోరుతున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india