Post Views: 60
మహిళా శక్తి, బహుజన చైతన్యానికి ప్రతీక ఐలమ్మ స్ఫూర్తి తరతరాలకు దిక్సూచి
. సాలూరు కేంద్రంలో ప్రజలతో ఐలమ్మ స్మారక వేడుకలు జాజ్వల్యంగా
. భూస్వామ్య దోపిడీకి ప్రతిఘటించిన ఓ మహిళా యోధురాలు – చాకలి ఐలమ్మ
, నిజామాబాద్ జిల్లా:
జాతీయ స్వాతంత్ర్యోద్యమానికి ఊరట ఇచ్చి, తెలంగాణ సాయుధ పోరాటానికి అగ్రగామిగా నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
సాలూరు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ప్రజా ప్రతినిధులు, రజక సంఘ సమితులు, స్థానిక ప్రజలు కలిసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలను ప్రసంగకర్తలు స్మరించారు.
పేదరికం, బాల్య వివాహం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన భూస్వామ్య దోపిడీకి ఎదిరించి నిలిచిన ఐలమ్మ పోరాట గాథను గుర్తుచేసుకున్నారు. ఆమె త్యాగం, నిర్భయత, బహుజన చైతన్యానికి మార్గదర్శకమని వక్తలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలు “ఐలమ్మ చరిత్ర తరతరాలకు స్ఫూర్తి… మహిళా శక్తికి మార్గదర్శి” అంటూ నినాదాలు చేశారు
ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్ధవర్ గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇళ్తేపు శంకర్ సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, కేజీ గంగారం, డిస్కో సాయిలు, జాడి నర్సయ్య, శివకాంత్ పటేల్, వెంకట్ పటేల్, సింగాడే పాండు సిరివేస్ సంతోష్, ఎల్ఐసి దత్తు, దళిత సోదరులు వివిధ పార్టీ మండల గ్రామ నాయకులు రజక కుల సోదరులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








