V1News Telangana

best news portal development company in india

మహారాష్ట్ర సరిహద్దు నిఘాపై దృష్టి – కమిషనర్ కఠిన సూచనలు . ఆన్‌లైన్ బెట్టింగ్ యువత ప్రాణాలు తీస్తోంది – పోలీస్ కమిషనర్ హెచ్చరిక…

SHARE:

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన కమిషనర్ – కఠిన సూచనలు! . సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలి – కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాలు . ప్రతి పోలీస్ 24X7 అందుబాటులో ఉండాలి – కమిషనర్ స్పష్టం . ట్రాఫిక్ కట్టుదిట్టం – రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి . విలేజ్ పోలీస్ ఆఫీసర్లతో గ్రామ సమస్యల పరిష్కారం – కమిషనర్ దిశానిర్దేశం

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించిన కమిషనర్ సాయి చైతన్య

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ పర్యవేక్షించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫామ్ టర్నౌట్, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలతో సమావేశమై పోలీసింగ్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు.

అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై స్పెషల్ ప్లాన్

ప్రతి కేసు నాణ్యమైన దర్యాప్తుతో ముగించాలనీ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలని సూచించారు.
సైబర్ నేరాలపై అవగాహన
సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌ యాప్స్‌ యువతకు ప్రమాదకరమని హెచ్చరించారు.
సరిహద్దు నిఘా, ట్రాఫిక్ కట్టుదిట్టం
మహారాష్ట్ర సరిహద్దు వరకు ఈ పరిధి ఉండటంతో నిఘా వ్యవస్థ బలోపేతం చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతి రోజు ప్రధాన కూడళ్లలో కట్టుదిట్టమైన ఎన్ఫోర్స్మెంట్ ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

సిబ్బందికి కఠిన సూచనలు

సిబ్బంది 24 గంటలు హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీ పి. శ్రీనివాస్‌, సీఐ విజయ్‌బాబు, ఎస్హెచ్ఓ వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india