V1News Telangana

best news portal development company in india

జాతరలో పోచారం – బాలరాజ్ మాస్ ఎంట్రీ… వర్షం వచ్చినా జనం ఫుల్ జోష్!”

SHARE:

 “75 ఏళ్ల జాతర… చరిత్ర సృష్టించిన రుద్రూర్ ఉత్సవం!”
 “లైటింగ్ లేక చీకట్లో జాతర… భక్తులకి ఎదురైన కష్టాలు!”
Oplus_16908288
 “ఎల్లమ్మ ఆటలు మిస్ అయి పెద్దల నిరాశ – పాతకాలపు రుచి ఎక్కడ?”
“పోలీసుల కష్టానికి సలాం… జీరో టెన్షన్‌తో ఘనవిజయం!”
“కాంగ్రెస్ – బీజేపీ నేతల గైర్హాజరీపై రచ్చ… ఏమైంది అసలు?”
రుద్రూర్‌లో గణపతి జాతర జోష్‌తో జిగేల్‌మని సాగింది. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సార్వజని ఉత్సవాల్లో జనసందోహం కిక్కిరిసింది. వేదికపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఎంట్రీతో జాతరలో హంగామా పీక్స్‌కి చేరింది.
రికార్డింగ్ డ్యాన్సులు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. మధ్యలో వర్షం కురిసినా జనం తగ్గలేదు. అన్నదానం సదుపాయాలు బాగున్నా, బస్టాండ్‌ నుంచి అంగడి బజార్‌ వరకు లైటింగ్ లేక భక్తులు చీకట్లో సతమతమయ్యారు.
పోలీసుల బందోబస్తుకు గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం విశేషం. అయితే ఎల్లమ్మ ఆటలు, బుర్రకథలు కనిపించకపోవడం పెద్దలకు నిరాశ కలిగించింది. మరీ కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ ఇన్‌చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గైర్హాజరీపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india