Post Views: 108
. ప్రశాంతంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపు
. రథయాత్రలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తుల సందడి..
బోధన్, సెప్టెంబర్ 6:
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. శ్రీ చక్రేశ్వర శివాలయం నుండి సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రలో భక్తుల ఉత్సాహం ఉరకలెత్తింది.
ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ శివుని, వినాయకునికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రథంలో గణనాథుడిని ప్రతిష్టించి శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తాసిల్దార్ విట్టల్, ఎసిపి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, ఆలయ చైర్మన్ హరికాంత్ చారి తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.
లడ్డు వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుడు ప్రమోద్ కథం రూ. 51 వేల రూపాయలకు లడ్డును పొందారు. ప్రధాన అతిథులుగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గత 11 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిని చేరేందుకు శోభాయాత్రగా ముందుకు సాగుతున్నాడు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత శాంతియుతంగా నిమజ్జనాన్ని విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.
శోభాయాత్రలో డప్పుల వాయిద్యాలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....












