V1News Telangana

best news portal development company in india

శాశ్వత అన్నదానానికి విరాళం అందజేసిన భక్తులు …

SHARE:

 

 

– వెంకటేశ్వర స్వామి పట్ల భక్తిని చాటుకుంటున్న ప్రజలు

– ఆలయ అభివృద్ధిలో తాము సైతం పాలుపంచుకుంటామని భక్తుల ఉత్సాహం

 

– రూ.25000 ఆలయ కమిటీ సభ్యులకు అందజేత

 

– దాత దొనకంటి రామిరెడ్డి

బీర్కూర్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కొండపై వెలసిన తెలంగాణ తిరుమల దేవస్థానంలో శనివారం రోజు పోతంగల్ మండలం కల్లూరు గ్రామ వాస్తవ్యులు దొనకంటి రాంరెడ్డి తండ్రి పేరు దొనకంటి కిష్టారెడ్డి పట్వారి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారు దేవాలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయంగా శాశ్వత అన్నదానం నిమిత్తం రూ.25000 ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు వారి కుటుంబ సభ్యుల వివరాలతో ప్రత్యేక పూజా, అర్చన కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదాలు అందించారు. స్వామివారి కృపా కటాక్షలతో వారు ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగి సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india