Post Views: 170
సాలూర, 2 సెప్టెంబర్(వి1 న్యూస్) : ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితుల్లో బోధన్ నియోజిక వర్గ అధికారులు చూపిన చురుకైన స్పందన ప్రశంసనీయమని బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల రక్షణకు ముందుకొచ్చిన అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొన్న రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆరోగ్య సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సంక్షోభ సమయంలో వారి సేవలు మరువలేనివని అన్నారు. ఈ సందర్బంగా ఆయన పలువురు అధికారులతో కలిసి సాలూర మండలంలోని ఖాజాపూర్, హున్స, మందర్న వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్కరికీ అండగా ప్రభుత్వం మీతో ఉందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
Author: మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్
వి1 న్యూస్ పత్రిక, ఛానల్ లో పని చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండలాల పాత్రికేయలు కావలెను. సంప్రదించాల్సిన నంబర్లు : 9603925163 - 9834485832








