Post Views: 81
సాలూర, 2 సెప్టెంబర్(వి1 న్యూస్) : నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో బోధన్ యువత ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలో షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం పై ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి తెలిపారు. కార్మికులు, రైతులు మోసపోకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతని, ఫ్యాక్టరీ ప్రారంభం విషయంలో మరోసారి మోసం జరిగితే గట్టిగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్, బోధన్ యువత సభ్యులు గంధం రాజేష్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివెసు సంతోష్ కురుమ, కార్మిక సంఘం నాయకులు రవిశంకర్ గౌడ్, బిజెపి నాయకులు కందికట్ల వాసు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జూనైద్, భారసా నాయకులు ప్రవీణ్ జాదవ్, బీఎస్పీ బోధన్ అసెంబ్లీ ఇంచార్జ్ నీరడి రవి, ఏఐఎస్బి జిల్లా కన్వీనర్ నాగరాజు, భారసా నాయకులు మహ్మద్ షైక్, ఏఐఎస్డిఎఫ్ జిల్లా కన్వీనర్ఎం .డి. మోసిన్, టిజివిపి బోధన్ డివిజన్ కన్వీనర్మీసాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Author: మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్
వి1 న్యూస్ పత్రిక, ఛానల్ లో పని చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండలాల పాత్రికేయలు కావలెను. సంప్రదించాల్సిన నంబర్లు : 9603925163 - 9834485832








