– ఆందోళన బాట పట్టిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కెసిఆర్ గొప్ప నాయకుడని అభివర్ణన
– నినాదాలతో హోరెత్తిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో
– సిబిఐ విచారణ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే మంత్రులను, ఎమ్మెల్యేలను అడగడుగునా అడ్డుకుంటామని హెచ్చరికలు
– బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ మంగళవారం రోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రయాణ ప్రాంగణం వద్ద నినాదాలతో హోరెత్తిస్తూ, ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.ఈ సందర్భంగా గొడిసెల నరసింహులు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన 420 హామీలను,13 గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు కెసిఆర్ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన పరిపాలనతో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపారని కొనియాడారు.అలాంటి మహనీయుడిపై సీబీఐ విచారణ కేసు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు టేకుర్ల సాయిలు , వెంకట్ సార్, గంపల శంకర్, గంగాధర్, అల్లం రాములు,లక్ష్మణ్, కనుకుట్ల శ్రీను,రాజు నాయక్, అంబర్ సింగ్, మంగలి సాయి కుమార్, మామిడి భూమయ్య, డి.సాయిలు,రమేష్, కుమార్, బద్రి, దత్తు, తర్ణం పోచయ్య, చుంచు శేఖర్, అక్తర్, అల్లం గంగారాం, షఫీ, కీసరి భూమయ్య,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








