V1News Telangana

best news portal development company in india

గొప్ప మనసు చాటుకున్న బీర్కూర్ పట్టణ యువకులు ….

SHARE:

 

– మృతుడి కుటుంబ సభ్యులకు రూ.46,300 ఆర్థిక సహాయం అందజేత

 

– కుటుంబ సభ్యులకు పరామర్శ, అండగా ఉంటామని భరోసా

 

– మానవత్వంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న బీర్కూర్ గ్రామ యువకులు

 

– కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మియాపురం శశికాంత్

 

బీర్కూర్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా (31) V1 న్యూస్: బీర్కూర్ మండల కేంద్రంలో గత కొద్దిరోజుల క్రితం జూకంటి క్రాంతి తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వారికి “రెక్కాడితే గాని డొక్కాడని” దీనస్థితిలో ఉన్న కుటుంబం వారి స్తోమతకు తగ్గట్టు ఆసుపత్రిలో ఖర్చులు చేసి కుమారుడిని రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు వైద్యులు అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. అప్పులు చేసి మరి చికిత్స అందించిన కుటుంబ సభ్యులు ఆపన్న హస్తం కొరకు ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మియాపురం శశికాంత్ మానవత దృక్పథంతో వెంటనే స్పందించి ఆయన పట్టణ యువతకు విషయాన్ని తెలియజేసి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు. బీర్కూర్ పట్టణ యువత అందరూ ఏకతాటిగా, ఐక్యమత్యంతో ఎవరికి తోచిన సహాయం వారు అందించి రూ.46,300 పోగు చేశారు. ఆదివారం రోజు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో, పలువురు యువకులు, పెద్దలు కలిసి మృతుడి తండ్రి జూకంటి మల్లేష్ కు ఆర్థిక సహాయం రూపాయలు 46,300 అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నందుకు గాను మృతుడి తండ్రి కన్నీరు, మున్నీరై యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గాను పట్టణ యువతకు అందరికీ శశికాంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాని బాబు, కొరిమె రఘు, ఆరె శివాజీ, యాట వీరేశం, పృధ్వి గౌడ్, రవి, లింగం, భూమయ్య, ధర్మ తేజ, సాయి, మేఘనాథ్, చింటు, ప్రశాంత్, అజీమ్, రాజు, అనిల్, రాజు, కాలేఖ్ , తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india