Post Views: 209
వరద ముంపు పంట నష్టం – తక్షణ పరిహారం ఇవ్వాలని బిఆర్ఎస్ డిమాండ్…
. రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని బిఆర్ఎస్ నేతల హెచ్చరిక…
బోధన్:
సాలూర మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో వరద ముంపుతో పంటలు నష్టపోయిన రైతులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బోధన్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, ఎన్డీసిసిబి డైరెక్టర్ గిర్ధావార్ గంగారెడ్డి భరోసా ఇచ్చారు.
శనివారం ఆయనతో పాటు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య, పలు గ్రామాల మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు ముంపు పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గిర్ధావార్ గంగారెడ్డి మాట్లాడుతూ – “రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనకు దిగుతాం” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








