Post Views: 122
ప్రజలకు ముందస్తు ఆరోగ్య పరీక్షలు – వైద్య విభాగం చర్యలు
45 మంది గర్భిణీలకు సురక్షిత వైద్య పర్యవేక్షణ…

శనివారం, 30 ఆగస్టు 2025
సాలూర: వరదతో ముంపుకు గురైన సాలూర మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో శనివారం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సాలూర మండల వైద్య ప్రత్యేక అధికారి డాక్టర్ రాజకుమార్ పర్యవేక్షణలో ఈ శిబిరాలు జరిగాయి.
సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్త చర్యగా గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జ్వరాలు, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి తక్షణ చికిత్స అందించి అవసరమైన మందులు అందజేశారు. ప్రజలు తీసుకోవలసిన శుభ్రత, ఆహార అలవాట్లపై డాక్టర్ అవగాహన కల్పించారు.
డాక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ, గ్రామాల్లో 45 మంది గర్భిణీలు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. వారికి ప్రత్యేక వైద్య పర్యవేక్షణతో పాటు ఆరోగ్య సూచనలు అందించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ ఇందిరా, వైద్య సిబ్బంది గంగామణి, ఆశా వర్కర్లు గోదావరి, అనురాధ, లక్ష్మీబాయి, సుధమ్మ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








