V1News Telangana

best news portal development company in india

వరద బాధితులను పరామర్శించి భరోసా అందించిన బిజెపి నాయకులు….

SHARE:

 

 

– పునరావాస కేంద్రం లో బాధితులను పరామర్శించి అల్పాహారం అందజేత

 

– దెబ్బతిన్న పంట పొలాలు, ఇండ్లు పరిశీలన రైతులకు ఓదార్పు

 

– వరదకు కారణమైన కాలువలో జెసిబి సహాయంతో పూడికతీత

 

– వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

 

– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి, బొమ్మన్దేవ్ పల్లి, అంకోల్ క్యాంప్ గ్రామంలో వరద ప్రభావంతో నీట మునిగిన పంటలు, నెమ్లి గ్రామంలో ఇండ్లలోకి నీరు చేరడంతో బాధితులను పునరావస కేంద్రానికి తరలించిన అధికారులు. నెమ్లి గ్రామంలో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను శుక్రవారం రోజు బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు పరామర్శించారు. దీనిలో భాగంగా బాధితులకు అల్పాహారం అందించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వరదకు ఢీ 23 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లో పేరుకుపోయిన చెత్త, చెదారం కారణంగానే ఇళ్లలోకి వరద వచ్చిందని వారు పేర్కొన్నారు. దీనితో అప్పటికప్పుడు సమస్యను కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఆర్థిక సహాయంతో జెసిబి సహాయంతో దగ్గరుండి పూడికతీత పనులను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగిన పంట పొలాలను , కాలనీలను పరిశీలించమన్నారు. నష్టపోయిన రైతులను, అదేవిధంగా వరద ప్రభావానికి గురైన బాధితులను ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల సీనియర్ నాయకులు అనుసూరి శ్రీనివాస్, అరిగె నారాయణ, పెరిక రాములు, కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, ఉల్లెంగ పర్వయ్య, జగ్బీర్ సింగ్, ర్యాపని మహేష్, తాటికోల్ శేఖర్, కొప్పుల సాయిలు, చందూరి సాయిలు, రామిరెడ్డి, బండి లక్ష్మణ్, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india