Post Views: 189
ప్రజల ప్రాణరక్షణలో పోలీసు, రెవెన్యూ బృందాల కృషి – పునరావాస కేంద్రాల్లో అన్నదానంతో కాంగ్రెస్ సేవా కార్యక్రమం…
బోధన్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంజీరా పరివాహక ప్రాంతమైన సాలూర మండలంలోని ఖజాపూర్, మందర్న, హున్సా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో గ్రామాలను వరద నీరు చుట్టుముట్టి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండగా, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇబ్బందులను మరింతగా పెంచింది…
ప్రజల రక్షణ కోసం అత్యవసర చర్యలు
మంజీరా పరివాహక ప్రాంత గ్రామాలను రెవెన్యూ అధికారులు స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. గర్భిణీ స్త్రీలను గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

రాత్రంతా నిఘా – అధికారులు ప్రశంసనీయ కృషి
గణేష్ మల్ల పాళ్ల పరిసరాల్లో తహసీల్దార్ రాత్రంతా నిఘా వహించడం గ్రామస్తులు ప్రశంసించారు. సహాయక చర్యల్లో ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి, మండల తహసీల్దార్ శశి భూషణ్ కీలక పాత్ర పోషించారు. నిన్నటినుంచి ఇప్పటివరకు కంటి మీద కునుకు లేకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేక రెస్క్యూ బృందాలు నిరంతరం సహాయం చేస్తున్నాయి.

రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులను కాపాడేందుకు అధికారులు ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్నారు.
కాంగ్రెస్ సేవా కార్యక్రమం – అన్నదానం
సాలూర మండల కేంద్రంలోని పునరావాస కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అన్నదానం నిర్వహించి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జరిగిన..

ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, సీనియర్ నాయకులు ఇల్తెపు శంకర్, అల్లె రమేష్, ఖాజాపూర్ అశోక్, శివకాంత్ పటేల్, కేజీ గంగారాం, సాలూర క్యాంప్ రమేష్, డిస్కో సాయిలు మరియు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలు ఈ సేవా కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. వరద నీరు తగ్గిన తర్వాత మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....











