V1News Telangana

best news portal development company in india

జలదిగ్బంధంలో చిక్కుకున్న బోయి వాడ….

SHARE:

 

– కుండపోత వర్షాల కారణంగా ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు

 

– చెరువును తలపిస్తున్న గ్రామాలు, ఇళ్లల్లోకి ప్రవేశించిన నీరు

 

– తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

 

– బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయం కల్పించిన అధికారులు

 

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వరుణుడు ఉగ్ర రూపం దాల్చడంతో మండల పరిధిలోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయి అలుగులు పారడంతో ఆ నీరు వాగులలో కలిసి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. తద్వారా పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. నసురుల్లాబాద్ మండల పరిధిలోని నెమ్లి గ్రామంలో చెరువు పూర్తిగా నిండిపోయి వరద నీరు గ్రామాన్ని చుట్టేసింది దీంతో గ్రామంలో గల బోయివాడలో పూర్తిగా జలమయం అవ్వడంతో మీరు ఇలలోకి ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధితులను పరామర్శించి పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు.హాజీపూర్, సంగం గ్రామాల మధ్య గల వాగు ఉప్పొంగి పారడంతో రాకపోకలు నిలిపేశారు.దుర్కి, మిర్జాపూర్ గ్రామాల మధ్య వాగు పారడంతో అధికారులు రహదారిని మూసి వేశారు. అదేవిధంగా నెమ్లి గ్రామంలో సాయిబాబా ఆలయం పక్కన 765 డి రహదారిపై ఎగువ ప్రాంతంలో ఉండి వస్తున్న వరద కారణంగా వాగు ఉదృతంగా ప్రవహించడంతో అధికారులు ప్రయాణికుల రాకపోకలను నిలిపివేసి దారిని మళ్లించి బొమ్మందేవ్ పల్లి గ్రామం మీదుగా బాన్సువాడ వైపు వెళ్లే వాహనాలను ఎస్సై రాఘవేంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తరలించారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సువర్ణ, ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, ఆర్ ఐ వెంకటేష్, ఎంపీ ఓ సూర్యకాంత్ ,ఎస్సై రాఘవేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india