V1News Telangana

best news portal development company in india

భారీ వర్షాలు – బోర్గం వద్ద 40 నిరాశ్రయులకు పోలీసుల ఆదరణ…

SHARE:

నిజామాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో బోర్గం పాంగ్ర వాగు ఉప్పొంగి ప్రవహించింది. ఫలితంగా బ్యాంకు కాలనీ సమీపంలోని నాలా పక్కన నివసిస్తున్న 15 కుటుంబాల గుడిసెల్లోకి నీరు చేరి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ పి. సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు, ఎసిపి రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నగర సిఐ శ్రీనివాస్ రాజు, ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఉదయ్ మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
శివాజీ సమితి మరియు స్థానికుల సహకారంతో 40 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించి, బింగి ఫంక్షన్ హాల్‌లో ఆశ్రయం కల్పించారు. మహిళలు, చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్లకు పండ్లను పంపిణీ చేస్తూ పోలీసులు మానవత్వం చాటుకున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india