V1News Telangana

best news portal development company in india

హంగార్గ గ్రామానికి చేరువలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌ వాటర్ – అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో సూచన..

SHARE:

హంగార్గ గ్రామానికి చేరువలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌ వాటర్ – అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో సూచన..
భారీ వర్షాల ప్రభావంతో ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ స్థాయి వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీరు హంగార్గ గ్రామానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి బోధన్ ఎమ్మార్వో  గ్రామాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి భద్రతా చర్యలపై చర్చించారు. “ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాము. అవసరమైతే పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాం” అని ఎమ్మార్వో  విఠల్ తెలిపారు.
గ్రామ ప్రజలు మాత్రం నీటి మట్టం పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మా ఇళ్లకు నీరు చేరుతుందేమోనని భయపడుతున్నాం. ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాలి” అని స్థానిక రైతులు పేర్కొన్నారు.
అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి మట్టం మరింత పెరిగితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india