V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ….

SHARE:

 

 

– 80 మందికి కండువాలు కప్పి స్వాగతం పలికిన మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్

 

– స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

– మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి

 

– ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

 

– క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అండగా నిలవాలని కార్యకర్తలకు ఆదేశాలు జారీ

 

బాన్సువాడ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మంగళవారం రోజు బాన్సువాడ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ,మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో నసురుల్లాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి నసురుల్లాబాద్, మైలారం, నెమ్లి, రాముల గుట్ట తాండ, నాచుపల్లి , అంకోల్ గ్రామాల నుండి బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ లో దాదాపు 80 మంది చేరారు. వారందరికీ బాజిరెడ్డి గోవర్ధన్ కండువాలను కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిందని అన్నారు. హామీలు అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమైందని ధ్వజమెత్తారు.. రైతులు యూరియా ఎరువులు అందుబాటులో లేక పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం నిమ్మక నియోజకవర్గంలో వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతాయన్నారు.. పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అందరూ అంకితభావంతో పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు అండగా ఉండి సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ , మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మామిడి భూమయ్య, మెక్కా సాయి, పెర్క కృష్ణ, రాజు, సంతోష్, గంగారం, సాయిలు, అక్త్యార్, అల్లం రాములు, చుంచు శేఖర్, దొంతి భాస్కర్, తర్ణం పోచయ్య, డి.సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india