V1News Telangana

best news portal development company in india

భారీ వర్షాల్లో ప్రజలకు అండగా కామారెడ్డి పోలీసులు – ప్రాణాలను పణంగా పెట్టి సేవలు

SHARE:

భారీ వర్షాల్లో ప్రజలకు అండగా కామారెడ్డి పోలీసులు – ప్రాణాలను పణంగా పెట్టి సేవలు…
కామారెడ్డి:
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ఉధృతిని తట్టుకుని ప్రజలకు అండగా నిలుస్తున్న కామారెడ్డి పోలీసు శాఖ సేవలు విశేషంగా ప్రశంసలు పొందుతున్నాయి. ఆపద సమయంలో సేవ చేసే అవకాశం అందరికీ రాదు కానీ, వచ్చినప్పుడు ఆ బాధ్యతను సార్ధకంగా నిర్వర్తిస్తున్న కామారెడ్డి పోలీసులు నిజమైన సేవాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.
జంగంపల్లి వద్ద జాతీయ రహదారి 44 పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రక్షణ, అత్యవసర సేవల సమన్వయం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఈ కష్టసమయంలో ప్రజల ప్రాణ, ఆస్తులను రక్షించడంలో పోలీసులు చూపిన చొరవకు స్థానికులు, ప్రజాసంఘాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
“పోలీసు సేవలు ప్రజల భద్రతకు అండగా నిలుస్తున్నాయి. ఈ ధైర్యసాహసాన్ని అందరూ సల్యూట్ చేయాలి” అని ప్రజలు అభిప్రాయపడ్డారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india