V1News Telangana

best news portal development company in india

ఇసుక రవాణ…. పండగ లేదు వర్షం లేదు… అడ్డు అదుపు అసలే లేదు.-

SHARE:

— అధికారులు పోలీసుల అండదండలేనంటు ప్రజల ఆరోపణలు.
—- ఎడపల్లి పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజల కృతజ్ఞతలు.

బోధన్ : ఇసుకను అక్రమంగా తరలించడానికి పండగ లేదు వర్షం లేదు అడ్డు అదుపు అసలే లేదు అన్న చందంగా ట్రాలీ ఆటోల ఆగడాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.వీరి ఆగడాలు మితిమీరడానికి అధికారులు పోలీస్ యంత్రాంగం అండదండ లేనంటు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

రోడ్డుపై అతివేగంగా ట్రాలీ ఆటోలు వెళుతున్న క్రమంలో ప్రయాణికులు భయాందోళనలకు గురి అవుతూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు.ట్రాలీ ఆటోలు నియంత్రణ ఎవరి వలన సాధ్యం అవుతుందో తెలియక ప్రజలు,ప్రయాణికులు ఇబ్బందుల పాలు అవుతున్నారు.సాలురా రెవెన్యూ అధికారులు సిబ్బంది కొరత వలన నియంత్రణ సాధ్యం కావడం లేదంటూ చేతులు దులుపుకుంటే పోలీసుల వ్యవహారం ఏంటోనంటు అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.బోధన్ రూరల్ మరియు పట్టణ ఠాణాల ప్రాంతాల మీదుగా ట్రాలీ ఆటోలు నిజామాబాద్ పరిసర ప్రాంతాలకు వెళుతున్న క్రమంలో ఎడపల్లి పోలీసులు ఉక్కుపాదం మోపుతూ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాలీ ఆటోలను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది.బోధన్ రూరల్,పట్టణ పోలీసులు ట్రాలీ ఆటోలను పట్టుకోకపోవడంపై అనేక అనుమానాలు వెన్నవెత్తుతున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india