V1News Telangana

best news portal development company in india

సాలూరలో గ్రంథాలయం, సిఎస్సి సెంటర్ ప్రారంభం – విద్యార్థులకు అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండాలి : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

SHARE:

సాలూర:
సాలూర మండల కేంద్రంలో గ్రంథాలయం మరియు సిఎస్సి సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనాన్ని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు, ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలి. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అన్నారు.
అలాగే, ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా సాలూర మండలంలోని పలు గ్రామాల్లో సోయాబీన్ పంటలకు నష్టం జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకురావడంతో ఆయన స్పందిస్తూ “పంట నష్టం నివేదికలను ప్రభుత్వానికి పంపి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. ఏదైనా నిర్లక్ష్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోందని తెలిపారు.
పామాయిల్ పంట సాగు లాభదాయకమని, రైతులు ఈ పంట పండించేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, క్రయవిక్రయాల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాని, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, తహసిల్దార్ శశిభూషణ్, PACS చైర్మన్ అల్లె జనార్ధన్, AMC చైర్మన్ చిల శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పాఠకులు పాల్గొన్నారు
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india