V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులపై మెరుపు దాడులు…

SHARE:

పోలీసుల సర్జ్‌ ఆపరేషన్‌: వడ్డీ మాఫియాలపై కఠినచర్యలు..

 పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వడ్డీ వ్యాపారులపై గట్టి దెబ్బ..

 అక్రమ ఫైనాన్స్ రాకెట్లపై పోలీసుల దాడులు – కోట్ల రూపాయల డాక్యుమెంట్లు స్వాధీనం..

 వడ్డీ వ్యాపారులకు షాక్‌ – నిజామాబాద్ పోలీసుల విస్తృత ఆపరేషన్..

నిజామాబాద్, ఆగస్టు 23:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ వడ్డీ మరియు అధిక వడ్డీ వ్యాపారులపై పోలీసులు శనివారం తెల్లవారుజామున విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ఈ దాడులు జరిగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎలాంటి లైసెన్స్ లేకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండానే అనేకమంది ఫైనాన్స్ పేరుతో అక్రమ వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. పేద కుటుంబాల అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
 
స్వాధీనం చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
చెక్కులు: నిజామాబాద్‌లో 137 (₹10,14,11,370 విలువ), ఆర్మూర్‌లో 62 (₹30,36,000), బోధన్‌లో 0
ప్రామిసరీ నోట్లు: నిజామాబాద్‌లో 170 (₹7,10,73,870 విలువ), ఆర్మూర్‌లో 324 (₹4,97,10,000), బోధన్‌లో 0
బాండ్ పేపర్లు: ఆర్మూర్‌లో 49 (₹1,85,30,500 విలువ), నిజామాబాద్‌లో 0, బోధన్‌లో 0
ల్యాండ్ డాక్యుమెంట్లు: నిజామాబాద్‌లో 99, ఆర్మూర్‌లో 5, బోధన్‌లో 0
నగదు: నిజామాబాద్‌లో ₹1,21,92,750
“అక్రమ వడ్డీ వ్యాపారులకు కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి ఫిర్యాదులు అందితే వెంటనే చర్యలు తీసుకుంటాం” అని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india