V1News Telangana

best news portal development company in india

కోటగిరిలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్..

SHARE:

కోటగిరిలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
 పేదలకు మెడికవర్ వైద్య సేవలు – కోటగిరి ఆరోగ్య శిబిరం ఘనంగా
 ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం: ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్…
. పేదల ఆరోగ్యమే లక్ష్యం – కోటగిరిలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం..
. కార్పొరేట్ వైద్య సేవలు గ్రామాల్లోకి – కోనేరు ట్రస్ట్ ఆరోగ్య శిబిరం…
కోటగిరి (నిజామాబాద్):
కోటగిరి మండల కేంద్రంలోని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎన్నారై కోనేరు శశాంక్ ప్రారంభించారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యం అని శశాంక్ తెలిపారు. నిజామాబాద్ కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని సుమారు 200 మంది రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు కూడా అందించారు.
ఈ సందర్భంగా ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెల్లడించారు. “గ్రామీణ ప్రజలు మెరుగైన వైద్య సేవలకు దూరంగా ఉన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యులను శిబిరాల ద్వారా గ్రామాలకే తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా అవసరమైన చికిత్సలు ఉచితంగా అందిస్తాం” అని ఆయన చెప్పారు.
ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానికంగా సహకరించిన బిజెపి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఏముల నవీన్, రుద్రూర్ మండల అధ్యక్షులు హరి, మాజీ అధ్యక్షులు ప్రకాష్ పటేల్, ఇతర స్థానిక నాయకులు పుల్లెల మోహన్ రావు, శ్యామల కులకర్ణి, నాగేల్లి శ్రీనివాస్, వడ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india