Post Views: 85
(బోధన్, ఆగష్టు 23 (వి1 న్యూస్) : డిజిటల్ యుగంలో సాంకేతికత ఉపయోగించాల్సిందే, కానీ జాగ్రత్తలు పాటించడమూ అంతే అవసరం. విద్యార్థిగా మీరు మీ భవిష్యత్తును కాపాడుకోవాలంటే, ఇలాంటి మోసాలను గుర్తించి, సరైన చర్యలు తీసుకోవాలని షీ టీమ్ ఏ ఎసై ఆశన్న అన్నారు. సాలూర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో షీ టీమ్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలిపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ .. అజ్ఞాతుల మెసేజ్లు లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించవద్దన్నారు.మోసపూరిత అకౌంట్లు ఆకర్షణీయమైన ప్రొఫైల్ ఫోటోలు ఉపయోగించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందని, వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయవద్దని వెల్లడించారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి రాజీ మంజూష, ఉపాధ్యాయులు పురానే విజయ్ కుమార్, గంధం సాయిలు, దండు రాజ్ కుమార్, విఠల్ కాంబ్లే, స్వామి, లక్ష్మి, విజయలక్ష్మి, అరుణ్ కుమార్, సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









