Post Views: 92
(బోధన్, ఆగష్టు 23 (వి1 న్యూస్) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా దివ్యంగులకు ఇచ్చిన మాట కట్టుబడి పింఛను 6 వేలకు పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అయేషా గార్డెన్ లో శనివారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతుడుతూ … సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛనుదారులకు పెంచి ఇస్తామన్న వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలు, వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్‌ను రూ.4 వేలు పెంచి ఇవ్వాలని తెలిపారు. కండరాల క్షీణత బాధితులకు ప్రత్యేకంగా రూ.15 వేలు మంజూరు చేయాలి కోరారు. వికలాంగుల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వాన్ని ఒత్తిడికి లోనుచేసి, అవసరమైన నిధులు మంజూరు చేయించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వఛ్చి రెండేళ్లు గడిచిన పింఛన్‌దారులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 9న మహా గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇట్టి గర్జనకు దివ్యంగులు, బీడీ కార్మికులు, నేతకార్మికులు, వృద్దులు, వితంతువులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ అయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ మహిళ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ, జిల్లా అధ్యక్షుడు కంటిశ్వర్ బీరప్ప, ఉపాధ్యక్షులు షేక్ సలీం, మహిళా విభాగం అధ్యక్షురాలు చిట్టి కృష్ణవేణి, పోశెట్టి, నిజామాబాద్ విహెచ్పిఎస్ ఇంచార్జ్ ప్రశాంత్ ఇతర మండల నాయకులు సతీష్, ఇర్ఫాన్, రవి, బూర శంకర్ మాదిగ, రెడ్డి శ్యామ్ రావు మాదిగ, బోధన్ నియోజకవర్గాల మండల అధ్యక్షులు, మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








