Post Views: 205
ప్రెగ్నెన్సీ రోబో! – కృత్రిమ గర్భాశయంతో విప్లవాత్మక ఆవిష్కరణ…
టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో చైనా మరో అద్భుత ఆవిష్కరణకు తెరతీసింది. కృత్రిమ గర్భాశయంతో కూడిన హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోను 2026 నాటికి విడుదల చేయనున్నట్లు కైవా టెక్నాలజీ సంస్థ ప్రకటించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇది అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ప్రెగ్నెన్సీ రోబో అంటే ఏమిటి?
ఈ రోబో మనిషిని పోలిన హ్యూమనాయిడ్ రూపంలో ఉంటుంది. ఇందులో ఏర్పాటు చేసిన కృత్రిమ గర్భాశయం సహజ గర్భాశయం మాదిరిగానే పనిచేస్తుంది. పిండాన్ని ఈ గర్భాశయంలో ప్రవేశపెట్టి, నవమాసాలు బిడ్డ ఎదగడానికి కావలసిన పోషకాలు, వాతావరణం అందించబడుతుంది. గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు మొత్తం ప్రక్రియ స్వయంచాలకంగా జరుగుతుంది.
ఎందుకు ఈ టెక్నాలజీ?
సంతానలేమితో బాధపడుతున్న జంటలకు ఈ ఆవిష్కరణ కొత్త ఆశను అందించనుంది. సాంప్రదాయ సరోగసి పద్ధతుల్లో అధిక వ్యయం, చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ రోబోతో ఆ సమస్యలు తొలగిపోతాయి. కైవా టెక్నాలజీ ప్రకారం, ఈ రోబో ధర సుమారు 1 లక్ష యువాన్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 12 లక్షలు).
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








