Post Views: 121
బోధన్ రూరల్, ఆగస్టు 22 ,
బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో శుక్రవారం ఎడ్ల పొలాల అమావాస్య పండుగ ఘనంగా జరుపుకున్నారు. రైతులు తమ ఎడ్లను వ్యవసాయ పనులలో రైతుకు వెన్నుదన్నుగా నిలబడి కీలకపాత్ర పోషించినందుకు ఉదయం పిల్ల జెల్లాతో పాటు చెరువుకుంటకు పోయి ఎడ్లను నీటితో శుభ్రంగా కడిగి ఇంటికి తీసుకువచ్చి అందంగా అలంకరించారు. మెడలో గంటలు , కాళ్లకు గజ్జెలు, రంగురంగుల గొoడలు, ఎద్దులకు రంగులు అద్ది అందంగా అలంకరించారు.ఎద్దులను స్థానిక హనుమాన్ ఆలయాల వద్దకు తీసుకెళ్లి ఆలయాo చుట్టూ తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటికి తోడుకొని వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా పాడి పంటలతో చివరి శ్రావణ మాస అమావాస్య రోజు ఎడ్ల పొలాల అమావాస్య జరుపుకుంటామని తెలిపారు. రైతులు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పిల్లలు, మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








