Post Views: 100
బోధన్ పట్టణంలో శ్రావణమాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మారుతి మందిరంలో ఆనవాయితీగా నందీశ్వర కళ్యాణం మరియు పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆనవాయితీ ప్రకారం గ్రామ దేశాయి అజయ్ వడియార్ స్వగృహం నుండి నందీశ్వరులు ఆలయానికి తీసుకురావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ VDC చైర్మన్ గంగాధర్ పట్వారి, ఆలయ కమిటీ అధ్యక్షులు గుండెడి శంకర్, కమిటీ సభ్యులు గుండెడి రాములు, ఆలయ కార్యనిర్వహణ అధికారి నాయకం రాములు, శివాలయం హరికాంత్ చారి, బోధన్ పట్టణ ఏఈ నాయిని కృష్ణ, అంకు సంతోష్ రెడ్డి, అంకు దాము, రాజేంద్ర ప్రసాద్, సభ్యులు బోదు శేఖర్, అటెండర్ సుధాకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నందీశ్వర కళ్యాణం మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








