V1News Telangana

best news portal development company in india

SRSP ప్రాజెక్ట్ సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ – భద్రతా చర్యలు పటిష్టం..

SHARE:

:నిజామాబాద్, ఆగస్టు 22:నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., గురువారం సాయంత్రం పోచంపాడు గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల ప్రాజెక్టుపై సందర్శకుల తాకిడి పెరగడంతో భద్రతా చర్యలను సమీక్షించారు.

ప్రాజెక్ట్ గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సాధారణ ప్రజలు గోదావరి నది దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర సందర్భాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 సంప్రదించాలని సూచించారు.
పర్యాటకుల సందడి దృష్ట్యా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్శనలో ఆర్మూర్ ఏసిపి వై. వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్సై జె. సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india