V1News Telangana

best news portal development company in india

హంపోలి గ్రామంలో పేదల ఇండ్ల స్థలాల అక్రమ పట్టాను రద్దు చేయాలి*

SHARE:

   *బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా*  

           బైంసా మండలం హంపోలి గ్రామంలో పేదల ఇండ్ల స్థలాలను అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని, అదే స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా జె రాజు మాట్లాడుతూ 1983లో వరదల కారణంగా 16/ఆ,16/ఈ,సర్వే నెంబర్ లోని ఐదు ఎకరాల పట్టా భూమిని కొని ఎస్సీ ఎస్టీ లకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది . ఆ భూమిలోని ఇండ్లను కూలగొట్టి అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. ఈ అక్రమ పట్టాను రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డిఓ లు, పై అధికారులకు నివేదికలు పంపిన ఇప్పటికీ రద్దు కాలేదని తెలిపారు. 
       ఈ అక్రమ పట్టా చేసిన అప్పటి తహసీల్దార్ పైన చర్యలు తీసుకోవాలని, అక్రమ పట్టాను రద్దు చేయాలని, రద్దు చేసే వరకు సర్వే నెంబర్ 16/ఈ, 16/ఆ లను నిషేధిత భూముల జాబితాలో పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
      ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత గ్రామస్తులు విట్టల్ గంగారం సాయినాథ్ సురేష్ బాబు ఎల్లన్న భోజన్న నరసన్న తదితరులు పాల్గొన్నారు..
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india